హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆర్చరీ అకాడమీని పరిశీలించిన కార్యదర్శి

ASR: రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి డి. మురళీధర్ రెడ్డి బుధవారం పాడేరు మండలం తలారసింగిలోని ఆర్చరీ అకాడమీని సందర్శించారు. గిరిజన విద్యార్థులకు అందిస్తున్న విలువిద్య శిక్షణ, ఫిట్‌నెస్ కార్యక్రమాలను పరిశీలించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా క్రీడాకారులకు మెరుగైన శిక్షణ, వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు.