NDL: డోన్ మండలం ఉడుములపాడు సమీపంలోని జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఉన్న లారీని స్కూటీ ఢీకొనడంతో తాటిమాను కొత్తూరుకు చెందిన వడ్డే సుశాంత్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో దొరపల్లికి చెందిన మిద్దె మహేశ్ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన మిద్దె మహేశ్‌ను చికిత్స కోసం స్థానికులు డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఆంధ్రప్రదేశ్
ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడి మృతి


