హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొత్తగూడెంలో ప్రయాణికులకు ఆర్టీసీ రాయితీ

BDK: ప్రయాణికుల సౌకర్యార్థం నెలవారీ సీజన్ టికెట్లపై ప్రత్యేక రాయితీలు కల్పిస్తున్నట్లు డిపో మేనేజర్ రాజ్యలక్ష్మి బుధవారం తెలిపారు. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సులకు దూరపరిమితి లేకుండా టికెట్లు పొందవచ్చన్నారు. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ టికెట్లతో కాంబినేషన్ సౌకర్యం ద్వారా ఇతర బస్సుల్లోనూ ప్రయాణించే అవకాశం ఉందని వివరించారు.