హైదరాబాద్: 28°C
తెలంగాణ

AIKS జాతీయ కౌన్సిల్ సభ్యునిగా బొంతు రాంబాబు

KMM: నల్గొండలో ఈ నెల 15 నుంచి 18వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు నిర్వహించిన అఖిల భారత రైతు సంఘం జాతీయ మహాసభలు ఘనంగా ముగిశాయి. ఈ మహాసభల్లో ఖమ్మం జిల్లాకు చెందిన రైతు సంఘం నాయకుడు బొంతు రాంబాబు జాతీయ కౌన్సిల్ సభ్యునిగా బుధవారం ఎన్నికయ్యారు. ఈ ఎన్నిక పట్ల రైతు సంఘం నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు అభినందనలు తెలిపారు.