హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉద్యమకారుల మండల అధ్యక్షుడిగా సారయ్య

BHPL: తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మొగుళ్లపల్లి మండల గౌరవ అధ్యక్షుడిగా ప్రెస్ క్లబ్ మండల అధ్యక్షుడు నిమ్మల సారయ్య ఎంపికయ్యారు. బుధవారం చిట్యాలలో జరిగిన మూడు మండలాల సదస్సులో రాష్ట్ర, జిల్లా నాయకులు ఆయన పేరును ప్రకటించారు. ఉద్యమకారుల హక్కుల సాధనకు ఈ నెల 22న మేడారంలో చేపట్టే పాదయాత్రను విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.