హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: తుఫాన్ దెబ్బకి పత్తి పంట నాశనం

PLD: పత్తిపంట వేసి నష్టపోయామని ఎడ్లపాడు(M) ఉప్పరపాలెంకి చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నాదెండ్ల(M) గణపవరం పరిధిలో పత్తి పంట వేశామని, మురసు తుఫాన్ దెబ్బకి చేతికొచ్చిన పంట నేల వాలిందన్నారు. అరకొర మిగిలి ఉన్న పత్తి కాయలు కుళ్లిపోయాయని, గుడ్డిపత్తిగా మారిందని రైతులు పేర్కొన్నారు. 4 ఎకరాలకు రూ. 3 లక్షలు పెట్టుబడి పెట్టి నష్టపోయామని, కూలీకు కూడా డబ్బులు రాలేదన్నారు.