హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డిప్యూటీ తహసీల్దార్ బ్రహ్మయ్యకు నివాళి

PLD: దాచేపల్లి మండల తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తూ అకాల మరణం పొందిన పిన్నబోయిన బ్రహ్మయ్య భౌతికకాయానికి మాచవరం తహసీల్దార్ నాగమల్లేశ్వరరావు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బ్రహ్మయ్య మరణం రెవెన్యూ శాఖకు తీరని లోటని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.