ELR: ఉంగుటూరు మండలం కాగుపాడు పీహెచ్‌సీలో డీఐవో పుల్లయ్య ఆధ్వర్యంలో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. శ్వాసకోశ వ్యాధుల నియంత్రణ, నవజాత శిశు సంరక్షణ, సచివాలయాల ప్రగతిపై సమీక్షించారు. పుట్టిన ప్రతి బిడ్డకు మెరుగైన వైద్య సేవలు అందించి, శిశు మరణాలను నివారించాలని డీఐవో పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైద్యులు మానస, శ్రావణ్, సుబ్బరాజు వర్మతో పాటు ఏఎన్ఎంలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పుట్టిన ప్రతి బిడ్డను కాపాడాలి: డీఐవో


