హైదరాబాద్: 28°C
తెలంగాణ

అయ్యప్ప ఆలయ నిర్మాణానికి భారీ విరాళం

NGKL: అచ్చంపేట పట్టణంలో అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణానికి పీజేఆర్‌ గ్రూప్‌ అధినేత పండుగ జగదీశ్వర్‌ రెడ్డి బుధవారం రూ.10 లక్షలు విరాళంగా అందించారు. ఈ సందర్భంగా అయ్యప్ప సేవా సమితి, మాలధారులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఆలయ అభివృద్ధికి సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఆయనను భక్తులు అభినందించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు.