హైదరాబాద్: 28°C
తెలంగాణ

విదేశీ ఉద్యోగాలపై అవగాహన కార్యక్రమం

NZB: విదేశీ ఉద్యోగాలు, ఉపాధి కోసం వెళ్లే యువత, కార్మికులకు సురక్షిత వలస విధానాలపై శుక్రవారం ఉదయం 11:30 గంటలకు నిజామాబాద్ ఐడీఓసీలో అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం తెలిపారు. విదేశీ ఉద్యోగాల పేరుతో జరిగే మోసాలు, అక్రమ రిక్రూట్‌మెంట్, మానవ అక్రమ రవాణాపై అవగాహన కల్పించనున్నట్లు వెల్లడించారు.