MBNR: మహబూబ్నగర్ మెట్టుగడ్డ ప్రధాన గ్రంథాలయంలో గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా బుధవారం చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మల్లు నరసింహారెడ్డి మాట్లాడుతూ.. గ్రంథాలయాలు శాంతి దేవాలయాలని, నిరుద్యోగులు, ఉద్యోగులు, విద్యార్థులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ
గ్రంథాలయ వారోత్సవాల్లో చిత్రలేఖనం పోటీలు


