హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన సన్న బియ్యం'

ప్రకాశం: గిద్దలూరు నియోజకవర్గ ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన సన్నబియ్యం అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా గిద్దలూరులోని రాచర్ల రోడ్డు, కొమరోలు బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన బియ్యం విక్రయ కేంద్రాలను ఎమ్మెల్యే అశోక్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా బియ్యం నాణ్యతను స్వయంగా పరిశీలించి ప్రజలకు పంపిణీ చేశారు.