హైదరాబాద్: 28°C
వార్తలు

కేంద్ర ప్రభుత్వంపై ఖర్గే విమర్శలు

దేశంలో ద్రవ్యోల్బణం, నిత్యావసర ధరల పెరుగుదలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. మోదీ 12 ఏళ్ల పాలనలో సామాన్యుడి కంచం చిన్నదై, జేబులు ఖాళీ అవుతున్నాయని 'X' వేదికగా ఎద్దేవా చేశారు. ఆర్థిక నిర్వహణ లోపాల మూల్యాన్ని ప్రజలు ఇంకెంతకాలం భరించాలని ఆయన ప్రశ్నించారు. ప్రధాని పాలనలో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు.