ములుగు మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం దరఖాస్తుల స్వీకరణకు 5 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కమిషనర్ సంపత్ తెలిపారు. డిసెంబర్18 వరకు దరఖాస్తులు స్వీకరించి ఆన్లైన్లో నమోదు చేసి ప్రతి కుటుంబానికి ప్రత్యేక యూనిక్ నంబర్ కేటాయిస్తామన్నారు. అర్హులైన కుటుంబాలకు రూ.5 లక్షల బీమా ఉంటుందన్నారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు
తెలంగాణ
‘బీమా దరఖాస్తులకు 5 కేంద్రాలు’


