భూపాలపల్లి జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు ఈ నెల 18 వరకు 17,949 దరఖాస్తులు అందినట్లు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. వీటిలో 16,497 ఆమోదం పొందగా, 1,433 తిరస్కరణకు గురయ్యాయని, మరో 19 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించారు. ఓటరు జాబితా రూపకల్పన పారదర్శకంగా చేపట్టాలని ఎన్నికల సంఘం కార్యదర్శి సుమన్ కుమార్ దాస్ సూచించారు.
తెలంగాణ
జిల్లాలో ఓటరు దరఖాస్తులకు ఆమోదం


