హైదరాబాద్: 28°C
తెలంగాణ

అర్హులకు చేయూత పెన్షన్ పత్రాల పంపిణీ

JN: లింగాల గణపురం గ్రామంలో అర్హులైన పలువురు లబ్ధిదారులకు మంజూరైన చేయూత పెన్షన్ పత్రాలను ఎంపీడీవో, ఎంపీఓ చేతుల మీదుగా బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యమన్నారు. పెన్షన్ మంజూరుతో లబ్ధిదారులకు ఆర్థిక భరోసా కలుగుతుందని తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులున్నారు.