హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్రంథాలయ వారోత్సవాల్లో చిత్రలేఖనం పోటీలు

JN: 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్ర గ్రంథాలయంలో 'వర్షపు నీటి సంరక్షణ' అంశంపై బుధవారం చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో పట్టణంలోని వివిధ పాఠశాలలకు చెందిన 55 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హెచ్ఎం కృష్ణవేణి హాజరై నీటి పొదుపు ఆవశ్యకత, గ్రంథాలయాల ప్రాముఖ్యతను వివరించారు.