హైదరాబాద్: 28°C
వార్తలు

సుప్రీంలో భారత్ సమ్మిట్ పిటిషన్ విచారణ

HYDలో జరిగిన భారత్ సమ్మిట్‌లో ఇటలీ నేత జియాకోమో ఫిలిబెక్ వ్యాఖ్యలపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు స్వీకరించింది. దీనిపై ఎల్లుండి విచారణ చేపట్టనుంది. సదస్సులో ఆయన 'ఓట్ చోర్, గద్దీ ఛోడ్' నినాదాలు చేశారని, విదేశీ నేత జోక్యం సరికాదని పిటిషనర్ పేర్కొన్నారు. సోషల్ మీడియా నుంచి ఆ వీడియోలను తొలగించాలని, తెలంగాణ ప్రభుత్వం బహిరంగ క్షమాపణ చెప్పేలా ఆదేశించాలని కోరారు.