హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో 52,044 దరఖాస్తులకు ఆమోదం

BDK: పట్టభద్రుల ఓటరు జాబితా తయారీలో పారదర్శకత, అర్హతల పరిశీలన తప్పనిసరిగా పాటించాలని ఎన్నికల సంఘం కార్యదర్శి సుమన్ కుమార్ దాస్ ఆదేశించారు. జిల్లాలో 57,376 దరఖాస్తులు రాగా, 52,044 ఆమోదించామని, 4,113 తిరస్కరించి, 1,219 పరిశీలనలో ఉన్నాయని అదనపు కలెక్టర్ వేణుగోపాల్ తెలిపారు. తుది జాబితాను డిసెంబర్ 30న ప్రకటించనున్నట్లు వెల్లడించారు.