HNK: వేలేరు మండల కేంద్రానికి చెందిన 65 ఏళ్ల మూడపు భిక్షపతికి 5 నెలలుగా వృద్ధాప్య పింఛన్ నిలిచిపోయింది. అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదని వాపోయారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొన్న చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి సమస్య చెప్పుకునేందుకు వెళ్లినా ఆయనను కలిసే అవకాశం దొరకలేదని తెలిపారు. పింఛన్ పునరుద్ధరించాలని ఆయన కోరుతున్నారు.
తెలంగాణ
5 నెలలుగా పింఛన్ బంద్


