VSP: అక్వాన్ తుఫాన్ ప్రభావంతో విశాఖ సాగర తీరంలో అలల తీవ్రత పెరిగింది. బుధవారం సాయంత్రం తీరం వెంబడి పలుచోట్ల బీచ్ కోతకు గురైంది. సందర్శకులు తీరానికి దూరంగా ఉంటూ అలలు, గాలుల తీవ్రతను గమనిస్తున్నారు. తుఫాన్ దిశ మార్చుకోవడంతో విశాఖపై ప్రభావం కొంత తగ్గినట్లు కనిపిస్తోంది. మెరైన్ పోలీసులు, వన్ టౌన్ పోలీసులు తీర ప్రాంతాల్లో నిరంతరం పర్యవేక్షణ చేపడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
తీరంలో అలల తీవ్రత


