హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డ్రైనేజీ కాలువలో జారిపడి వృద్దుడి మృతి

SKLM: టెక్కలి శంభానవీధికి చెందిన ఆట్ల మధుసూధనరావు(64) అనే వృద్ధుడు బుధవారం డ్రైనేజీలో జారిపడి మృతిచెందాడు. పోలీసుల ప్రకారం వీధిలో కాలువ పనులు జరుగుతున్న నేపథ్యంలో వేకువజామున ఇంటి నుంచి బయటకు వచ్చి ప్రమాదవశాత్తు కాలువలో జారిపడటంతో గాయపడ్డాడు. కుటుంబీకులు టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించగా మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.