హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దాడిలో గాయపడిన వైసీపీ నేతకు ఎంపీ పరామర్శ

KDP: కమలాపురం వైసీపీ నేత సంబటూరు ప్రసాద్‌రెడ్డిపై పాచికలపాడు గ్రామంలో నామినేషన్ సందర్భంగా టీడీపీ నేతలు దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. తీవ్రంగా గాయపడిన ఆయనను కడప రిమ్స్‌లో చికిత్సకు తరలించారు. విషయం తెలుసుకున్న ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఆసుపత్రికి వెళ్లి పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.