హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రూ.40 లక్షల విలువైన 200 మొబైళ్లు రికవరీ

VZM: జిల్లాలో పోగొట్టుకున్న 200 మొబైల్ ఫోన్లను పోలీసులు ట్రాక్ చేసి బాధితులకు తిరిగి అందజేశారు. బుధవారం SP దామోదర్ జిల్లా పోలీసు కార్యాలయంలో బాధితులకు ఫోన్లు అప్పగించారు. వీటి విలువ రూ.40 లక్షలు కాగా, ఈ ఏడాది ఇప్పటివరకు రూ.1.50 కోట్ల విలువైన 750 మొబైళ్లను రికవరీ చేసినట్లు తెలిపారు. మొబైల్ పోగొట్టుకున్నవారు సీఈఐఆర్ పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు.