GDWL: మానవపాడులో అర్హులైన లబ్ధిదారులకు కొత్త పెన్షన్ల మంజూరు పత్రాలను ఎంపీడీవో రాఘవ, స్పెషల్ ఆఫీసర్ వీరప్ప అందజేశారు. మండలంలో కొత్తగా 630 పింఛన్లు మంజూరైనట్లు అధికారులు వెల్లడించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ప్రభుత్వ ఫలాలు అందేలా నిరంతరం కృషి చేస్తామని వారు భరోసా ఇచ్చారు. ఆయా గ్రామాల లబ్ధిదారులకు సర్పంచ్ల ఆధ్వర్యంలో పంపిణీ చేశారు.
తెలంగాణ
మానవపాడులో 630 కొత్త పెన్షన్ల మంజూరు


