హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిరుపయోగ పుస్తకాల సేకరణ వాహనం ప్రారంభం

RR: ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్ వికాస్ ఆధ్వర్యంలో 'పుస్తక సేకరణ వాహనం' ప్రారంభమైంది. ప్రజల వద్ద ఉన్న నిరుపయోగ పుస్తకాలను సేకరించి, అవసరమైన వారికి అందించడమే దీని ముఖ్య ఉద్దేశం. అన్ని సర్కిళ్లలో నిరుపయోగంగా ఉన్న భవనాలను గ్రంథాలయాలుగా తీర్చిదిద్దుతూ, ప్రజల్లో పఠనాసక్తిని పెంపొందించడంతో పాటు చక్కటి సామాజిక వేదికలను ఏర్పాటు చేస్తున్నారు.