హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తెనాలిలో ఎలక్ట్రికల్ షాపులో భారీ చోరీ

GNTR: తెనాలిలోని రాజు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ షాపులో దొంగలు చోరీకి పాల్పడి సుమారు రూ. లక్ష విలువైన సొత్తును అపహరించారు. షాపు తాళాలు పగలగొట్టి 10 కాపర్ వైర్ బాబిన్లు, రిపేర్‌కు వచ్చిన 10 సెల్‌ఫోన్లు, రూ.4 వేల నగదును ఎత్తుకెళ్లారు. టూ టౌన్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించగా, క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది.