హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆర్చరీ పోటీలకు ఎంపికైన సత్య సాయి విద్యార్థులు

E.G: జిల్లా స్థాయి ఆర్చరీ పోటీల్లో రాజమహేంద్రవరం శ్రీ సత్య సాయి గురుకులం విద్యార్థులు విజేతలుగా నిలిచి, రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించనున్నట్లు ప్రిన్సిపల్ కె. గురయ్య తెలిపారు. విద్యార్థిని వర్రే మౌనిష అండర్-15 విభాగంలో పసిడి, వర్రే జేష్ఠ అండర్-13, అండర్-15 విభాగాల్లో పసిడి, రజిత పతకాలు సాధించారు. విజేతలను యాజమాన్యం అభినందించింది.