హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పి. గన్నవరం సర్పంచ్ అభ్యర్థిగా కొండలరావు

కోనసీమ: పి. గన్నవరం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కూటమి తరఫున జనసేన పార్టీకి చెందిన గణేశుల చిన్న కొండలరావును ఎంపిక చేసినట్లు ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ప్రకటించారు. ఈ మేరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ద్వారా ప్రకటన విడుదల చేశారు. కూటమి నాయకులు, కార్యకర్తలు ఈ నిర్ణయాన్ని గమనించి సమన్వయంతో ముందుకు సాగాలని ఎమ్మెల్యే కోరారు. కూటమి విజయానికి అందరూ కృషి చేయాలన్నారు.