హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అనంతపురంలో భారీ ఉద్యోగ మేళా

ATP: అనంతపురంలోని AF ఎకాలజీ సెంటర్‌లో నవంబర్ 21న భారీ ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. SEEDAP, APSSDC, NCS సంయుక్త ఆధ్వర్యంలో జరిగే ఈ మేళాలో 14 కంపెనీలు పాల్గొని 350 ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నాయి. 10వ తరగతి నుంచి డిగ్రీ, బీటెక్ వరకు అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. నెలకు రూ. 9 వేల నుంచి రూ. 30 వేల వరకు వేతనం ఉంటుంది.