హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ముదునూరు సర్పంచ్‌గా మహేష్ నామినేషన్

కృష్ణా: ఉయ్యూరు మండలం ముదునూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్ధిగా టీడీపీ తరుపున మత్తే మహేష్ బుధవారం నామినేషన్ వేశారు. ప్రస్తుతం ఈ సర్పంచ్ స్థానాన్ని ఎస్సీ జనరల్‌కి కేటాయించడంతో మహేష్ దాఖలు చేశారు. తనను గెలిపిస్తే గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో AMC ఛైర్మన్ కొండా ప్రవీణ్, మాజీ సర్పంచ్ జ్ఞానశేఖర్, తదితర టీడీపీ నాయకులు పాల్గొన్నారు.