హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కో ఆప్షన్ సభ్యుడిగా షేక్ అబ్దుల్ రహ్మాన్ నామినేషన్

ELR: ఉంగుటూరు మండల పరిషత్తులో బీజేపీకి కో ఆప్షన్ సభ్యత్వం ఖరారైనట్లు సమాచారం. ఎంపీటీసీ ఎన్నికల్లో బీజేపీకి ఒక్క స్థానం కూడా కేటాయించకపోవడంతో, కూటమిలో భాగంగా కో ఆప్షన్ పదవిని బీజేపీకి కేటాయించినట్లు తెలుస్తోంది. చేబ్రోలు గ్రామానికి చెందిన షేక్ అబ్దుల్ రహ్మాన్ గురువారం కో ఆప్షన్ సభ్యుడిగా నామినేషన్ దాఖలు చేయనున్నట్లు బీజేపీ సీనియర్ నాయకులు తెలిపారు.