హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పునర్నిర్మాణ పనులను తనిఖీ చేసిన 'రైల్వే జెనరల్ మ్యానేజర్'

ATP: దక్షిణ తీర రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాథుర్, గుంతకల్లు డివిజన్‌లోని రేణిగుంట యార్డు పునర్నిర్మాణ పనులను బుధవారం తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగా పనుల పురోగతిని సమీక్షించి, సురక్షితమైన రైళ్ల రాకపోకలను సులభతరం చేసేలా పనులను సకాలంలో పూర్తి చేయాలని, యార్డు పనులు సమర్థవంతంగా, త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.