హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గ్రంథాలయంలో ఉత్సాహంగా మ్యూజికల్ చైర్స్ పోటీలు

GNTR: 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా పట్టాభిపురం శాఖా గ్రంథాలయంలో విద్యార్థులకు మ్యూజికల్ చైర్స్ పోటీలు బుధవారం సాయంత్రం నిర్వహించారు. ఈ పోటీల్లో 40 మందికి పైగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం గ్రంథాలయ అధికారి పమిడిపూల సత్య శిరీష మాట్లాడుతూ.. విద్యార్థులు ఆటపాటలతో పాటు పుస్తక పఠనాన్ని కూడా అలవాటు చేసుకోవాలని సూచించారు.