హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తెనాలిలో బైక్ దొంగల ముఠా గుట్టురట్టు

GNTR: తెనాలిలో బైక్ దొంగతనం కేసును టూ టౌన్ పోలీసులు ఛేదించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి చోరీకి గురైన బైక్‌తో పాటు గుంటూరు, విజయవాడ రైల్వే, బస్ స్టేషన్లలో దొంగిలించిన 12 ఆండ్రాయిడ్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ రూ.3.20 లక్షలుగా పోలీసులు తెలిపారు. బుధవారం సీఐ డీ. రవీంద్రబాబు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.