హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఓటింగ్ శాతం పెంచి కూటమికి మద్దతు తెలపాలి: ఎమ్మెల్యే

ELR: పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం 10 నుంచి 12 శాతం వరకు తగ్గిందని ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. బుధవారం ఆయన ఏలూరులో మాట్లాడుతూ.. అధికార పార్టీ గెలుస్తుందనే భావనతో కొందరు ఓటు వేసేందుకు రాకపోవడం సరైన పద్ధతి కాదన్నారు. ప్రజలు తమ మద్దతును ఓటు రూపంలో తెలియజేయాలని సూచించారు. రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.