హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన ఆర్డీవో

NLR: ఆత్మకూరు డివిజన్ పరిధిలోని 9 మండలాల్లో ప్రారంభమైన నామినేషన్‌ల ప్రక్రియను ఆర్డీవో బి. పావని పరిశీలించారు. ఆత్మకూరు ఎంపీడీవో కార్యాలయంలోని నామినేషన్ కేంద్రాన్ని సందర్శించి ఏర్పాట్లను తనిఖీ చేశారు. నిబంధనల ప్రకారం ఎలాంటి వివాదాలకు తావులేకుండా నామినేషన్‌లు స్వీకరించాలని సిబ్బందికి సూచించారు. పోలీసులకు బందోబస్తుపై పలు సూచనలు చేశారు.