హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

VZM: డెంకాడ మండలం లింగాల వలస పెట్రోల్ బంక్ సమీపంలో గురు వారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ బ్రేకులు ఫెయిల్ కావడంతో డ్రైవర్ ఒక్కసారిగా డివైడర్ వైపు తిప్పగా, వెనుక నుంచి వచ్చిన స్కూటీ లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో పూసపాటిరేగ మండలం తిప్పలవలసకు చెందిన చోడిపల్లి పెద్ద కొర్లయ్య మృతి చెందగా, వాసుపల్లి అప్పన్నకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేశారు.