నంద్యాలలోని శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఎస్పీ సునీల్ షొరాణ్ ఆదేశాల మేరకు ఇన్స్పెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో లోన్ యాప్, ఉద్యోగాలు, పెట్టుబడులు, డిజిటల్ అరెస్ట్ మోసాలపై వివరించారు. మోసానికి గురైతే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్
'సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి'


