హైదరాబాద్: 28°C
తెలంగాణ

యువజన ఉత్సవాల్లో ఆకట్టుకున్న బజార్‌హత్నూర్ విద్యార్థులు

ADB: జిల్లా స్థాయి యువజన ఉత్సవాల్లో బజార్‌హత్నూర్ మోడల్ స్కూల్ విద్యార్థులు బుధవారం తమ ప్రతిభను చాటారు. సోలో, తెలంగాణ డప్పుల జానపద నృత్యాలు, పాటలతో ప్రేక్షకులను అలరించి ప్రశంసలు అందుకున్నారు. విద్యార్థులలో దాగి ఉన్న కళాత్మక సృజనాత్మకతను వెలికితీయడానికి సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని సకల కళా డైరెక్టర్ కాత్లే శ్రీధర్ పేర్కొన్నారు.