హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డిసెంబర్ 23న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ముసాయిదా జాబితా

ఉమ్మడి గుంటూరు–కృష్ణా జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ముసాయిదా ఓటర్ల జాబితాను డిసెంబర్ 23న విడుదల చేయనున్నట్లు కలెక్టర్ కృతిక శుక్లా తెలిపారు. ఇప్పటివరకు 3,343 దరఖాస్తులు అందాయని వెల్లడించారు. జనవరి 12, 2027 వరకు క్లెయిములు, అభ్యంతరాలు స్వీకరించి, ఫిబ్రవరి 2న తుది జాబితా ప్రచురించనున్నట్లు తెలిపారు. అర్హులైన ఉపాధ్యాయులు ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు.