ATP: 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా అనంతపురం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో బుధవారం ఉత్తమ గ్రంథపాలకుల సన్మాన కార్యక్రమం జరిగింది. ఉమ్మడి అనంతపురం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వడ్డే వెంకట్, కార్యదర్శి జే. శివ ప్రసాద్ కలిసి గ్రంథాలయ సిబ్బంది ఎ.ఎమ్. శ్రీపతి, హెచ్. సత్యం బాబు, జి. సత్యనారాయణలను శాలువాలు, జ్ఞాపికలతో సత్కరించారు.
ఆంధ్రప్రదేశ్
ఉత్తమ గ్రంథపాలకులకు ఘన సన్మానం


