హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈవ్ టీజింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు: సీఐ

అన్నమయ్య: కొడూరు బాలికల ఉన్నత పాఠశాలలో పోలీసులు ఈవ్ టీజింగ్‌పై అవగాహన కల్పించారు. సీఐ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. వేధింపులకు గురైతే భయపడకుండా ఫిర్యాదు చేయాలని సూచించారు. నిందితులపై కేసులతో పాటు రౌడీషీట్లు తెరుస్తామని హెచ్చరించారు. అత్యవసర సహాయం కోసం 100, 112 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.