హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల వ్యయంపై కఠిన నిఘా: విజయకుమార్

NTR: జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు బి. విజయకుమార్ విజయవాడలో ఇవాళ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రెండో సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి దశ నేపథ్యంలో అభ్యర్థుల వ్యయ పర్యవేక్షణను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని, ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించాలని సూచించారు.