భువనేశ్వర్‌కు చెందిన ఆర్యాగోయల్ అనే ఆరు రోజుల శిశువు పేరిట డీమ్యాట్ ఖాతా తెరిచారు. NOV 13న 'పాకెట్‌ఫుల్' సంస్థ వేదికగా కుటుంబ సభ్యులు ఈ ఖాతాను ప్రారంభించారు. దీంతో భారత్‌లో అత్యంత పిన్నవయస్కురాలైన డీమ్యాట్ ఖాతాదారుగా ఆర్య రికార్డు సృష్టించింది. అంతకుముందు 12 రోజుల శిశువు పేరిట ఉన్న రికార్డు ఇప్పుడు ఈ చిన్నారి పేరు మీదికి మారింది.
వార్తలు
ఆరురోజుల శిశువుకు డీమ్యాట్ ఖాతా


