అనకాపల్లి 112వ డివిజన్ AMC కాలనీలో కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు బుధవారం కార్పొరేటర్ ఆళ్ల వైష్ణవి శ్రీకారం చుట్టారు. ఎంపీ, ఎమ్మెల్యే, మేయర్ సహకారంతో నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేస్తామని వైష్ణవి తెలిపారు. AMC కాలనీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆళ్ళ రామచంద్ర రావు, పోలారపు త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కమ్యూనిటీ హాల్ పనులకు శ్రీకారం


