హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బుగ్గరామలింగేశ్వరస్వామి క్షేత్రంలో కార్తీక ప్రత్యేక అలంకరణ

ATP: తాడిపత్రిలోని శ్రీ బుగ్గరామలింగేశ్వరస్వామి క్షేత్రంలో కార్తీక మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 9వ రోజు స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారికి అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. వేకువజాము నుంచే భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.