హైదరాబాద్: 28°C
వార్తలు

సోనియా గాంధీకి ఎదురుదెబ్బ

కాంగ్రెస్ నేత సోనియా గాంధీకి ఢిల్లీ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. భారత పౌరసత్వం రాకముందే ఓటర్ల జాబితాలో ఆమె పేరు చేర్చారన్న ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాలని రౌస్ అవెన్యూ కోర్టు పోలీసులను ఆదేశించింది. దీనిపై యాక్షన్ టేకెన్ రిపోర్ట్ దాఖలు చేయాలని సూచించింది. బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ వికాస్ త్రిపాఠి దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై విచారణ ఈ నెల 28కి వాయిదా పడింది.