హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పీహెచ్‌సీని సందర్శించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి

కోనసీమ: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎం. దుర్గారావు దొర గోపాలపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, రికార్డులను పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు, సలహాలు అందించారు. రానున్న తుఫాను నేపథ్యంలో గర్భిణులు, బాలింతలకు అవసరమైన వైద్య సేవలు, మందులు అందుబాటులో ఉంచాలన్నారు.