హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బిళ్లకుర్రులో టీడీపీలోకి భారీగా చేరికలు

కోనసీమ: కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. బుధవారం బిళ్ళకుర్రులో భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరగా, ఎమ్మెల్యే వారికి పసుపు కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.